AP Grama Sachivalayam important bits part-2
- స్థానిక ప్రభుత్వ పాలనా సంస్థల్లో భారతీయులకు ప్రవేశం కల్పించాలని సూచించిన తీర్మానం ఏది?
జ: లార్డ్ మేయో తీర్మానం
- గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ‘కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ను ఎప్పుడు ప్రవేశపెట్టింది?
జ: 1952 అక్టోబరు 2
- గ్రామీణ రైతులకు సాంకేతిక సహకారం, చిన్న పెట్టుబడిదారులకు సహాయం అందించడానికి ప్రవేశపెట్టిన పథకం ఏది?
జ: నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్
- మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మొదటి స్థాయి పంచాయతీ ఏది?
జ: గ్రామ పంచాయతీ
- గ్రామస్థాయిలో పంచాయతీ పరిధిలోని గ్రామ ఓటర్ల జాబితాలో రిజిస్టరైన సభ్యుల సమూహం ఏది?
జ: గ్రామ సభ
- ‘పొలిటికల్ డైనమిక్స్ ఆఫ్ పంచాయతీ’ గ్రంథకర్త ఎవరు?
జ: పి.సి.మాథూర్
- సర్పంచ్ పదవి ఏదైనా కారణం వల్ల ఖాళీ ఏర్పడితే దాన్ని ఎన్ని రోజుల్లో భర్తీ చేయాల్సి ఉంటుంది?
జ: 120
- ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఎన్ని జిల్లా పరిషత్‌లు ఉన్నాయి?
జ: 22
- మన రాష్ట్రంలో ఎన్ని రెవెన్యూ మండలాలు ఉన్నాయి?
జ: 1128
- స్థానిక సంస్థల పనితీరును సమీక్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్/కమిటీ ఏది?
జ: రాయల్ కమిషన్
- కిందివాటిలో గ్రామ పంచాయతీలకు సంబంధించని పన్ను ఏది?
1) ప్రభుత్వ గ్రాంట్లు 2) ఇంటిపన్ను
3) వ్యవసాయపు పన్ను 4) భూమిపై స్థానిక పన్నులు
జ: 3 (వ్యవసాయపు పన్ను)
- ‘కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జ: 1952
- ‘కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది?
జ: జనాభా
- ‘కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ అత్యధికంగా దేనికి ప్రాధాన్యం ఇస్తుంది?
జ: సంక్షేమ కార్యక్రమాలు
- ‘కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ ప్రధానంగా ఎక్కడ అమలుచేస్తారు?
జ: మండల స్థాయిలో
- ఏ పంచాయతీ రాజ్ సంస్థలు దేశ రాజకీయ ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా ఉన్నాయి?
1) గ్రామ పంచాయతీలు 2) మండల పరిషత్
3) జిల్లా పరిషత్ 4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)
- మన దేశంలో బౌద్ధం వెల్లివిరిసిన కాలంలోనే స్థానిక సంస్థలు ఉండేవని పేర్కొన్నవారెవరు?
జ: అంబేద్కర్
- ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఆదేశానుసారం ఎవరి అధ్యక్షతన సంఘం ఏర్పాటై పంచాయతీరాజ్ సంస్థలో రావలసిన మార్పులను సూచించింది?
జ: ఇందిరా గాంధీ
- ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్ సంస్థల తీరుతెన్నులు పరిశీలించడానికి ఉన్నతాధికార సంఘాన్ని ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది?
జ: 1971
- రాష్ట్రాల్లోని పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించి ఎవరిని ముఖ్యమైన వ్యక్తిగా పరిగణిస్తారు?
జ: పంచాయతీ సమితి ఛైర్మన్
- ఏ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి సర్వీసును ఆవిష్కరించింది?
జ: రాజస్థాన్
- పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికల్లోని లోటుపాట్లను ఏ కమిటీ తీవ్రంగా విమర్శించింది?
జ: సంతానం కమిటీ
- పంచాయతీ పదవీకాలం ముగిసేలోపే రద్దయితే ఎంత కాలంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలి?
జ: 6 నెలలు
- పంచాయతీ ఎన్నికల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు?
జ: రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా నియమించే అధికారిక సంఘం
- పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించి వి.పి.నాయక్ నివేదికపై ఏ రాష్ట్రం ప్రధానంగా ఆధారపడింది?
జ: మహారాష్ట్ర
- పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించి ఆర్.యు.పరేక్ నివేదికపై ఏ రాష్ట్రం ప్రధానంగా ఆధారపడింది?
జ: గుజరాత్
- పంచాయతీ రాజ్ సంస్థలు నిధుల కోసం ప్రధానంగా వేటి మీద ఆధారపడతాయి?
జ: ప్రభుత్వ సహాయం
- పంచాయతీ రాజ్ సంస్థల రాబడి, వ్యయాలపై ఆడిటింగ్‌లకు సంబంధించిన నిబంధనలు రూపొందించేది-
జ: పార్లమెంట్
- మండల పరిషత్‌లు ఏర్పడక ముందు రాష్ట్రంలో ఎన్ని పంచాయతీ సమితులు ఉండేవి?
జ: 330
- ఆంధ్రప్రదేశ్‌లో ‘బోర్డ్ ఆఫ్ రెవెన్యూ’ ఎప్పుడు రద్దు అయ్యింది?
జ: 1967
- మానవ వనరుల పరస్పర సహకారం ద్వారా అభివృద్ధి సాధించడానికి దేన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు?
జ: గ్రామం
- 1971లో నియమించిన ఉన్నతాధికార సంఘం అధ్యక్షుడు ఎవరు?
జ: సి.నరసింహం
- మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్‌ల నిర్మాణానికి ప్రత్యేక చట్టం ఎప్పుడు చేశారు?
జ: 1986
- ప్రస్తుత స్థానిక స్వపరిపాలన సంస్థల ఆవిర్భావం, అభివృద్ధి స్వాతంత్య్రానికి ముందు ఎన్ని భాగాలుగా ఉండేది?
జ: మూడు
- ఏ సంవత్సరంలో రూపొందించిన రెగ్యులేషన్ చట్టం నెం.29 ప్రవేశంతో పంచాయతీ విధానం ప్రారంభమైంది?
జ: 1802
- స్థానిక బోర్డుల చట్టం కింద ప్రతి రెవెన్యూ గ్రామంలో గ్రామ సంఘాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1884
- మద్రాసు పంచాయతీల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
జ: 1920
- ‘ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం – 1986’ ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
జ: 1987 జనవరి 15
- గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని సూచించిన కమిటీ ఏది?
జ: దంతవాలా కమిటీ
- పంచాయతీ రాజ్ సంస్థల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి సంతానం కమిటీని ఎప్పుడు నియమించారు?
జ: 1963
Click Here AP Grama sachivalayam imp bits part-1