AP Grama Sachivalayam important bits

🌳🌳పంచాయతీరాజ్ వ్యవస్థ🌳🌳

 

  1. పూర్వకాలంలో గ్రామ స్వపరిపాలనకు ప్రసిద్ధి చెందిన రాజవంశం ఏది?

జ: చోళులు

 

  1. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, సమాజ వికాస కార్యక్రమాల సక్రమ నిర్వహణకు పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ?

జ: బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ

 

  1. ‘స్థానిక ప్రభుత్వం స్వేచ్ఛగా ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా నిర్వహించేదే ప్రజల ప్రభుత్వం’ అని అన్నదెవరు?

జ: మాంటేగ్ హారిస్

 

  1. స్థానిక స్వపరిపాలన గురించి ఎక్కువ గౌరవం, విశ్వాసం ఉన్న జాతీయ నాయకుడు ఎవరు?

జ: మహాత్మాగాంధీ

 

  1. కిందివాటిలో స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన చట్టం ఏది?

     1) 1919 చట్టం      2) 1909 చట్టం      3) 1835 చట్టం      4) 1773 చట్టం

జ: 1 (1919 చట్టం)

 

  1. ‘స్థానిక ప్రభుత్వం అంటే ఒక గ్రామం లేదా ఒక రాష్ట్రం కంటే చిన్న ప్రాంతంలో గణనీయమైన స్వయం ప్రతిభ కలిగిన ప్రజా ప్రతినిధులు స్థానిక పన్నుల ద్వారా సేకరించిన ఆదాయంతో స్థానిక సేవలకోసం నిర్వహించే పాలన’ అని నిర్వచించినవారు?

జ: మామిడిపూడి వెంకట రంగయ్య

  1. పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఏమిటి?

జ: గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తులతో కూడిన గ్రామీణ స్వపరిపాలనా వ్యవస్థ

 

  1. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ సంస్థలను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

జ: 1959

 

  1. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న స్థానిక సంస్థలేవి?

      1) గ్రామ ప్రాంత స్థానిక సంస్థలు               2) పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు

      3) పై రెండు సంస్థలు                              4) ఏదీకాదు

జ: 3 (పై రెండు సంస్థలు)

 

  1. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన గ్రామ ప్రాంత స్థానిక సంస్థలేవి?

        1) గ్రామ పంచాయతీ         2) మండల ప్రజా పరిషత్తు

        3) జిల్లా ప్రజా పరిషత్తు      4) పైవన్నీ

జ: 4 (పైవన్నీ)

 

  1. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రాంత స్థానిక సంస్థలేవి?

       1) మున్సిపాలిటీలు        2) కార్పొరేషన్లు     3) పై రెండూ          4) ఏదీకాదు

జ: 3 (పై రెండూ)

 

  1. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్దేశించే రాజ్యాంగ నిబంధన ఏది?

జ: 40వ నిబంధన

 

  1. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సిఫార్సు చేసిన పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏది?

జ: గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తులతో కూడిన మూడంచెల వ్యవస్థ

 

  1. పంచాయతీరాజ్ వ్యవస్థను సమగ్రంగా పరిశీలించిన రెండో కమిటీ ఏది?

జ: అశోక్ మెహతా కమిటీ

 

  1. అశోక్ మెహతా కమిటీ సిఫార్సు చేసిన పంచాయతీరాజ్ వ్యవస్థ ఏది?

జ: మండల పంచాయతీ, జిల్లా ప్రజా పరిషత్తుతో కూడిన రెండంచెల వ్యవస్థ

 

  1. గ్రామ పంచాయతీలో ఎన్ని ప్రధాన విభాగాలు ఉన్నాయి?

జ: 4

 

  1. గ్రామ పంచాయతీలోని ప్రధాన విభాగాలు ఏవి?

       1) గ్రామసభ           2) గ్రామ పంచాయతీ      3) సర్పంచ్, ఉపసర్పంచ్      4) పైవన్నీ

జ: 4 (పైవన్నీ)

  1. గ్రామ సభ అంటే ఏమిటి?

జ: గ్రామ ఓటర్లందరితో కూడిన సభ

 

  1. గ్రామసభ సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలి?

జ: 2

 

  1. గ్రామ పంచాయతీలో ఎంత మంది సభ్యులు ఉంటారు?

జ: 5-31

 

  1. గ్రామ సభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?

జ: సర్పంచ్

 

  1. గ్రామ పంచాయతీ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు?

జ: గ్రామ ఓటర్లు

 

  1. గ్రామ పంచాయతీ ఎన్నికలకోసం గ్రామాన్ని ఏవిధంగా విభజిస్తారు?

జ: వార్డులు

 

  1. గ్రామ సర్పంచ్‌ను ఎవరు ఎన్నుకుంటారు?

జ: గ్రామ ఓటర్లు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు

 

  1. గ్రామ పంచాయతీ సభ్యుల పదవీ కాలం ఎంత?

జ: 5 సంవత్సరాలు

 

  1. గ్రామ సర్పంచ్ పదవీ కాలం ఎంత?

జ: 5 సంవత్సరాలు

 

  1. గ్రామ ఉప సర్పంచ్‌ను ఎవరు ఎన్నుకుంటారు?

జ: గ్రామ పంచాయతీ సభ్యులు

 

  1. పంచాయతీ సిబ్బందిపై ఎవరికి నియంత్రణ ఉంటుంది?

జ: కార్యనిర్వహణాధికారి

 

  1. గ్రామ కార్యనిర్వహణాధికారిని ఎవరు నియమిస్తారు?

జ: రాష్ట్ర ప్రభుత్వం

 

  1. గ్రామ పంచాయతీ సమావేశానికి ఎంత ‘కోరం’ అవసరం?

జ: మొత్తం సభ్యుల సంఖ్యలో మూడో వంతు

 

  1. గ్రామ పంచాయతీ విధించాల్సిన తప్పనిసరి పన్నులేవి?

జ: ఇంటిపన్ను, వ్యాపార పన్ను

 

  1. గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు?

జ: రాష్ట్ర ప్రభుత్వం

 

  1. కొన్ని గ్రామాలను కలిపి ఏర్పరిచిన పంచాయతీరాజ్ వ్యవస్థను ఏమంటారు?

జ: పంచాయతీ సమితి

 

  1. పంచాయతీ సమితిని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు?

జ: మండల ప్రజా పరిషత్

 

  1. ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ చట్టాలను ఎప్పుడు రూపొందించారు?

జ: 1986 జనవరి 13

 

  1. మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు?

జ: మండల ఓటర్లు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు

 

  1. జిల్లా స్థాయిలోని పంచాయతీరాజ్ వ్యవస్థ ఏది?

జ: జిల్లా ప్రజా పరిషత్

 

  1. ప్రాచీనకాలంలో స్థానిక సంస్థలను ఏమని పిలిచేవారు?

జ: శ్రేణులు

 

  1. ప్రాచీనకాలంలో గ్రామాధికారిని ఏమని పిలిచేవారు?

జ: గ్రామణి

 

  1. దేశంలో గ్రామస్థాయిలో పాలనా వ్యవస్థ పటిష్టంగా ఉందని వివరించిన శాస్త్రం –

జ: అర్థ శాస్త్రం

 

Click Here AP Grama sachivalayam imp bits part-2

Leave a Comment