AP Grama Sachivalayam important bits-3

AP Grama Sachivalayam important bits-3

 

  1. ప్రణాళిక సంఘం గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన పథకాల పాలనా ఏర్పాట్ల కోసం జి.వి.కె. రావు కమిటీని ఎప్పుడు నియమించింది?

జ: 1985

 

  1. ఏ నిబంధనను అనుసరించి 21 ఏళ్లు ఉన్నవారు పంచాయతీ ఎన్నికలకు అర్హత పొందుతారు?

జ: 243 (ఎఫ్)

 

  1. పంచాయతీల కాలపరిమితిని గురించి వివరించే నిబంధన ఏది?

జ: 243 (ఇ)

 

  1. పంచాయతీరాజ్ సంస్థలపై ఎల్.ఎమ్.సింఘ్వీ కమిటీని ఎవరి ప్రభుత్వ హయాం (1986)లో నియమించారు?

జ: రాజీవ్ గాంధీ

 

  1. మనదేశంలో పంచాయతీరాజ్ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ ఏది?

జ: గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

  1. గ్రామీణ ప్రాంతాల్లో 243 (బి) నిబంధన కింద ఏర్పాటు చేసిన స్థానిక పరిపాలనా సంస్థ ఏది?

జ: గ్రామ పంచాయతీ

 

  1. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు గౌరవ వేతనం (రూపాయల్లో) ఎంత ఉంటుంది?

జ: 1000

 

  1. మైనర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు గౌరవ వేతనం (రూపాయల్లో) ఎంత ఉంటుంది?

జ: రూ. 600

 

  1. ఏ నిబంధన ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తుంది?

జ: 243 (కె)

 

  1. పంచాయతీ సంస్థల అధికారాలు, విధులను తెలియజేసే నిబంధనలు ఏవి?

జ: 243 (జి), 243 (హెచ్)

 

  1. పంచాయతీ రాజ్ వ్యవస్థలోని పంచాయతీ సమితి కంటే జిల్లా పరిషత్తుకే ప్రధాన కార్యనిర్వాహక శాఖ అధికారాలు ఉండాలని సూచించింది-

జ: పాలనా సంస్కరణల సంఘం 1969

 

  1. కిందివాటిలో పంచాయతీ రిజర్వేషన్లు లేని రాష్ట్రం?

       1) నాగాలాండ్       2) కర్ణాటక        3) జమ్మూకాశ్మీర్      4) గుజరాత్

జ: 3 (జమ్మూకాశ్మీర్)

 

  1. పంచాయతీ రాజ్ సంస్థల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ నిబంధనలు ఏవి?

జ: 243 (డి)

 

  1. పంచాయతీ రాజ్ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది?

జ: బి.పి.ఆర్.విఠల్ కమిటీ

 

  1. పంచాయతీ రాజ్ సంస్థల ఆడిటింగ్‌ను ఎవరు నిర్వహిస్తారు?

జ: లోకల్ ఫండ్ ఆడిటర్స్

  1. రాయల్ వికేంద్రీకరణ కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

జ: 1907

 

  1. రాయల్ కమిషన్ సిఫార్సు మేరకు స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని తెలియజేసే చట్టం

జ: మింటో మార్లే చట్టం 1909

 

  1. 1986లో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండల ప్రజా పరిషత్తుల సంఖ్య

జ: 1104

 

  1. భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ

జ: గ్రామ సభ

 

  1. ‘గ్రామ సభ సంవత్సరం’గా ఏ సంవత్సరాన్ని ప్రకటించారు?

జ: 1999

 

  1. గ్రామాధికారుల నిర్వహణ కోసం గ్రామ పన్ను చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

జ: 1967

 

  1. పంచాయతీ సంస్థల్లో ‘అంచల్ కమిటీ’ వ్యవస్థ ఏ రాష్ట్రంలో ఉంది?

జ: అరుణాచల్ ప్రదేశ్

 

  1. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల వివాదాలను పరిష్కరించే కోర్టు

జ: మున్సిఫ్ కోర్టులు

 

  1. స్పెషల్ గ్రేడ్ గ్రామ పంచాయతీల బడ్జెట్‌ను కిందివాటిలో ఎవరికి సమర్పించరు?

1) మండల పంచాయతీ అధికారి              2) జిల్లా పంచాయతీ అధికారి     

3) జిల్లా కలెక్టరు                                   4) ఎవరూ కాదు

జ: జిల్లా పంచాయతీ అధికారి

 

  1. జిల్లా పరిషత్ స్థాయీ సంఘాలు ఎంత కాలానికి ఒకసారి సమావేశం కావాలి?

జ: రెండు నెలలు

 

  1. ఏ రాష్ట్ర పంచాయతీకి జ్యుడీషియల్ అధికారాలు ఉన్నాయి?

జ: బీహార్

 

  1. మండల వ్యవస్థకు సంబంధించిన బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎప్పుడు ఆమోదించింది?

జ: 1987 జులై

 

  1. పంచాయతీ సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎవరు?

జ: బి.డి.ఒ.

 

  1. గ్రామ పంచాయతీలను విధిగా ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన్నారు?

జ: చతుర్థ భాగం

 

  1. పంచాయతీరాజ్ సంస్థల పద్దులను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)తో ఆడిట్ చేయించాలని ఏ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదించింది?

జ: 64వ సవరణ

 

  1. గ్రామ సభలను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని సూచించిన రాజ్యాంగ నిబంధన ఏది?

జ: 243 (ఎ)

 

  1. గ్రామ స్వరాజ్య సాధనలో తొలి ప్రయత్నంగా మన దేశంలో దేన్ని పేర్కొంటారు?

జ: కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం

 

  1. మన గ్రామసభను పోలిన స్థానిక స్వపరిపాలనా సంస్థ ఏ దేశంలో ఉంది?

జ: స్విట్జర్లాండ్

 

  1. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ సామాజిక ఉద్యమంలో ఒక భాగంగా ఉంది?

జ: సర్వోదయ

 

  1. లోకల్ ఫండ్ ఆడిటర్ తమ ఆడిట్ నివేదికను ఎవరికి పంపిస్తారు?

జ: జిల్లా అభివృద్ధి అధికారి

 

  1. గ్రామ పంచాయతీకి, ప్రభుత్వానికి మధ్య ఎవరు అనుసంధానకర్తగా పనిచేస్తారు?

జ: పంచాయతీ కార్యనిర్వహణాధికారి

 

  1. ఆంధ్రప్రదేశ్‌లో మూడంచెల పద్ధతిలో పరోక్షంగా ఎన్నికలు జరిగిన సంవత్సరం?

జ: 1964 – 1981

 

  1. గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఎవరు సూచించారు?

జ: మహాత్మాగాంధీ

 

  1. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ను ఎవరు నియమిస్తారు?

జ: రాష్ట్ర గవర్నర్

 

  1. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జిల్లా ప్రణాళికా కమిటీ ఏర్పాటుకు వీలు కల్పించారు?

జ: 73వ రాజ్యాంగ సవరణ

 

Click Here AP Grama sachivalayam imp bits part-2

 

Click Here AP Grama sachivalayam imp bits part-4

Leave a Comment