AP Grama Sachivalayam important bits

AP Grama Sachivalayam important bits part-2

  1. స్థానిక ప్రభుత్వ పాలనా సంస్థల్లో భారతీయులకు ప్రవేశం కల్పించాలని సూచించిన తీర్మానం ఏది?

జ: లార్డ్ మేయో తీర్మానం

 

  1. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ‘కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం’ను ఎప్పుడు ప్రవేశపెట్టింది?

జ: 1952 అక్టోబరు 2

 

  1. గ్రామీణ రైతులకు సాంకేతిక సహకారం, చిన్న పెట్టుబడిదారులకు సహాయం అందించడానికి ప్రవేశపెట్టిన పథకం ఏది?

జ: నేషనల్ ఎక్స్‌టెన్షన్ సర్వీస్

 

  1. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మొదటి స్థాయి పంచాయతీ ఏది?

జ: గ్రామ పంచాయతీ

 

  1. గ్రామస్థాయిలో పంచాయతీ పరిధిలోని గ్రామ ఓటర్ల జాబితాలో రిజిస్టరైన సభ్యుల సమూహం ఏది?

జ: గ్రామ సభ

  1. ‘పొలిటికల్ డైనమిక్స్ ఆఫ్ పంచాయతీ’ గ్రంథకర్త ఎవరు?

జ: పి.సి.మాథూర్

 

  1. సర్పంచ్ పదవి ఏదైనా కారణం వల్ల ఖాళీ ఏర్పడితే దాన్ని ఎన్ని రోజుల్లో భర్తీ చేయాల్సి ఉంటుంది?

జ: 120

 

  1. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఎన్ని జిల్లా పరిషత్‌లు ఉన్నాయి?

జ: 22

 

  1. మన రాష్ట్రంలో ఎన్ని రెవెన్యూ మండలాలు ఉన్నాయి?

జ: 1128

 

  1. స్థానిక సంస్థల పనితీరును సమీక్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్/కమిటీ ఏది?

జ: రాయల్ కమిషన్

 

  1. కిందివాటిలో గ్రామ పంచాయతీలకు సంబంధించని పన్ను ఏది?

        1) ప్రభుత్వ గ్రాంట్లు               2) ఇంటిపన్ను

        3) వ్యవసాయపు పన్ను       4) భూమిపై స్థానిక పన్నులు

జ: 3 (వ్యవసాయపు పన్ను)

 

  1. ‘కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం’ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?

జ: 1952

 

  1. ‘కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం’ ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది?

జ: జనాభా

 

  1. ‘కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం’ అత్యధికంగా దేనికి ప్రాధాన్యం ఇస్తుంది?

జ: సంక్షేమ కార్యక్రమాలు

 

  1. ‘కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం’ ప్రధానంగా ఎక్కడ అమలుచేస్తారు?

జ: మండల స్థాయిలో

 

  1. ఏ పంచాయతీ రాజ్ సంస్థలు దేశ రాజకీయ ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా ఉన్నాయి?

        1) గ్రామ పంచాయతీలు          2) మండల పరిషత్

        3) జిల్లా పరిషత్                     4) పైవన్నీ

జ: 4 (పైవన్నీ)

 

  1. మన దేశంలో బౌద్ధం వెల్లివిరిసిన కాలంలోనే స్థానిక సంస్థలు ఉండేవని పేర్కొన్నవారెవరు?

జ: అంబేద్కర్

  1. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఆదేశానుసారం ఎవరి అధ్యక్షతన సంఘం ఏర్పాటై పంచాయతీరాజ్ సంస్థలో రావలసిన మార్పులను సూచించింది?

జ: ఇందిరా గాంధీ

 

  1. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్ సంస్థల తీరుతెన్నులు పరిశీలించడానికి ఉన్నతాధికార సంఘాన్ని ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది?

జ: 1971

 

  1. రాష్ట్రాల్లోని పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించి ఎవరిని ముఖ్యమైన వ్యక్తిగా పరిగణిస్తారు?

జ: పంచాయతీ సమితి ఛైర్మన్

 

  1. ఏ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి సర్వీసును ఆవిష్కరించింది?

జ: రాజస్థాన్

 

  1. పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికల్లోని లోటుపాట్లను ఏ కమిటీ తీవ్రంగా విమర్శించింది?

జ: సంతానం కమిటీ

 

  1. పంచాయతీ పదవీకాలం ముగిసేలోపే రద్దయితే ఎంత కాలంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలి?

జ: 6 నెలలు

 

  1. పంచాయతీ ఎన్నికల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు?

జ: రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా నియమించే అధికారిక సంఘం

 

  1. పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించి వి.పి.నాయక్ నివేదికపై ఏ రాష్ట్రం ప్రధానంగా ఆధారపడింది?

జ: మహారాష్ట్ర

 

  1. పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించి ఆర్.యు.పరేక్ నివేదికపై ఏ రాష్ట్రం ప్రధానంగా ఆధారపడింది?

జ: గుజరాత్

 

  1. పంచాయతీ రాజ్ సంస్థలు నిధుల కోసం ప్రధానంగా వేటి మీద ఆధారపడతాయి?

జ: ప్రభుత్వ సహాయం

 

  1. పంచాయతీ రాజ్ సంస్థల రాబడి, వ్యయాలపై ఆడిటింగ్‌లకు సంబంధించిన నిబంధనలు రూపొందించేది-

జ: పార్లమెంట్

 

  1. మండల పరిషత్‌లు ఏర్పడక ముందు రాష్ట్రంలో ఎన్ని పంచాయతీ సమితులు ఉండేవి?

జ: 330

 

  1. ఆంధ్రప్రదేశ్‌లో ‘బోర్డ్ ఆఫ్ రెవెన్యూ’ ఎప్పుడు రద్దు అయ్యింది?

జ: 1967

 

  1. మానవ వనరుల పరస్పర సహకారం ద్వారా అభివృద్ధి సాధించడానికి దేన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు?

జ: గ్రామం

 

  1. 1971లో నియమించిన ఉన్నతాధికార సంఘం అధ్యక్షుడు ఎవరు?

జ: సి.నరసింహం

 

  1. మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్‌ల నిర్మాణానికి ప్రత్యేక చట్టం ఎప్పుడు చేశారు?

జ: 1986

 

  1. ప్రస్తుత స్థానిక స్వపరిపాలన సంస్థల ఆవిర్భావం, అభివృద్ధి స్వాతంత్య్రానికి ముందు ఎన్ని భాగాలుగా ఉండేది?

జ: మూడు

 

  1. ఏ సంవత్సరంలో రూపొందించిన రెగ్యులేషన్ చట్టం నెం.29 ప్రవేశంతో పంచాయతీ విధానం ప్రారంభమైంది?

జ: 1802

 

  1. స్థానిక బోర్డుల చట్టం కింద ప్రతి రెవెన్యూ గ్రామంలో గ్రామ సంఘాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

జ: 1884

 

  1. మద్రాసు పంచాయతీల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?

జ: 1920

 

  1. ‘ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం – 1986’ ఎప్పుడు అమల్లోకి వచ్చింది?

జ: 1987 జనవరి 15

 

  1. గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని సూచించిన కమిటీ ఏది?

జ: దంతవాలా కమిటీ

 

  1. పంచాయతీ రాజ్ సంస్థల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి సంతానం కమిటీని ఎప్పుడు నియమించారు?

జ: 1963

 

Click Here AP Grama sachivalayam imp bits part-1

 

Click Here AP Grama sachivalayam imp bits part-3

Leave a Comment