తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ద్వితీయ సంవత్సర మార్కుల మెమోలను విడుదల చేసింది. విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉన్నత కోర్సుల్లో ప్రవేశాలకు ఇవి ఉపయోగపడనున్నాయి. మార్కుల మెమోలో తప్పులుంటే ఫిర్యాదు చేసేందుకు ఇంటర్‌బోర్డు అవకాశం కల్పించింది. జులై 10లోపు టోల్ ఫ్రీ నెంబర్ 040 24600110కు ఫోన్ చేసి చెప్పాలని సూచించింది.
రాష్ట్రంలో కరోనా తీవ్రత నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. ద్వితీయ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూన్ 28న విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మందిని ఉత్తీర్ణులుగా ప్రకటించారు. ఇందులో 2,28,754 మంది బాలికలు, 2,22,831 మంది బాలురు ఉన్నారు. 1,04,886 మంది విద్యార్థులు గ్రేడ్ -ఏ 61,887 మంది గ్రేడ్ -బి సాధించగా.. 1,08,093 మందికి సీ గ్రేడ్ వచ్చింది.
Download memo link::వెబ్‌సైట్: https://tsbie.cgg.gov.in/
To Subscribe ![]() |
Click Here |
To Join![]() |
Click Here |
To Join![]() |
Click Here |