ఎస్బీఐలో 2 వేల PO పోస్టులు-SBI Bank Degree JOBS
SBI PO recruitment 2020 State Bank of India Released Job notification with 2000 Probationary Officer posts Know all details
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న 2 వేల ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీని చేపట్టింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వచ్చే నెల 4 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రిలిమ్స్ పరీక్షలు డిసెంబర్ 31న ప్రారంభం కానున్నాయి.
మొత్తం పోస్టులు: 2000 (జనరల్-810, ఎస్సీ-300, ఎస్సీ-150, ఓబీసీ-540, ఈడబ్ల్యూఎస్-200)
అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 2020, ఏప్రిల్ 1 నాటికి 21 నుంచి 30 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
రాతపరీక్ష రెండు విడతలు ఉంటుంది. మొదటిది ప్రిలిమ్స్. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 చొప్పున మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులు ఉంటాయి. పరీక్షను గంటలో రాయాల్సి ఉంటుంది.
రెండో విడుత పరీక్ష అయిన మెయిన్స్‌లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, 50 మార్కులకు వ్యాసరూప ప్రశ్నలు అడుగుతారు. వీటిలో అర్హత సాధించినవారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. దీనికి 50 మార్కులు కేటాయించారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 4
అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజులేదు.
అడ్మిట్ కార్డుల విడుదల: డిసెంబర్ మూడో వారం
ప్రిలిమ్స్ ఎగ్జామ్: డిసెంబర్ 31, జనవరి 2, 4, 5 తేదీల్లో
ప్రిలిమ్స్ ఫలితాలు: 2021, జనవరి మూడో వారం
మెయిన్స్ పరీక్ష: 2021, జనవరి 29
మెయిన్స్ ఫలితాలు: 2021, ఫిబ్రవరి చివరి వారంలో
ఇంటర్వ్యూ: : 2021, ఫిబ్రవరి లేదా మార్చి నెలలో
To Subscribe Youtube Channel | Click Here |
To Join Whatsapp | Click Here |
To Join Telegram Channel | Click Here |