SSC CGL(Combined Graduate Level) 2019 Notification Full Details

SSC CGL(Combined Graduate Level) 2019 Notification Full Details

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL ఎగ్జామినేషన్ 2019 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC.

కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ట్యాక్స్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ అకౌంటెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ లాంటి గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేయనుంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి

భర్తీ చేయనున్న పోస్టులు ఇవే…

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
అసిస్టెంట్
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ట్యాక్స్
ఇన్‌స్పెక్టర్
అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
సబ్ ఇన్‌స్పెక్టర్
డివిజనల్ అకౌంటెంట్
జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2
ఆడిటర్
అకౌంటెంట్
జూనియర్ అకౌంటెంట్
సీనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్
ట్యాక్స్ అసిస్టెంట్
అప్పర్ డివిజన్ క్లర్క్

[PDF Telugu] Nobel Prize Winners 2019::click here

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం  – 2019 అక్టోబర్ 22

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 25

అప్లికేషన్ రిసిప్ట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2019 నవంబర్ 25 సాయంత్రం 5 గంటలు
ఆన్‌లైన్ ఫీజ్ పేమెంట్‌కు చివరి తేదీ- 2019 నవంబర్ 27 సాయంత్రం 5 గంటలు

విద్యార్హత-

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ / అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సంబంధిత అంశంలో బ్యాచిలర్స్ డిగ్రీ.

జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు 12వ తరగతిలో మ్యాథ్స్‌లో 60% మార్కులతో పాస్ కావాలి. లేదా స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్టుకు స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.

ఇక మిగతా అన్ని పోస్టులకు డిగ్రీ ఉంటే చాలు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు.

2020 జనవరి 1 నాటికి డిగ్రీ పూర్తి చేయడం తప్పనిసరి.

దరఖాస్తు ఫీజు- రూ.100

SSC CGL Examination 2019: ఎంపిక విధానం

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL ఎగ్జామినేషన్ 2019 ద్వారా ఉద్యోగం సాధించాలంటే మొత్తం నాలుగు దశల్లో విజయవంతం కావాల్సి ఉంటుంది.

2020 మార్చి 2 నుంచి 2020 మార్చి 11 వరకు మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మొదటి దశలో పాసైనవాళ్లు రెండో దశ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌కు అర్హత సాధిస్తారు.

2020 జూన్ 22 నుంచి 2020 జూన్ 25 రెండో దశ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది.

ఇందులో క్వాలిఫై అయినవాళ్లు మూడో దశ డిస్క్రిప్టీవ్ పేపర్ రాయాలి. మూడో దశ పరీక్షలో పాసైనవారికి

నాలుగో దశలో కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ / డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ / డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. చాలావరకు పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ website ఓపెన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in

Leave a Comment