TSSPDCL Recruitment Notification 2019 ||TS JLM,JPO NOTIFICATION 2019

TSSPDCL Recruitment Notification 2019

తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌ (TSSPDCL)లో 3025 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అక్టోబరు 14న నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ నోటిఫికేషన్ వెలువడితే అదే రోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

వాస్తవానికి అక్టోబరు 10న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. కానీ టెక్నికల్ సమస్యల కారణంగా నోటిఫికేషన్‌ను విడుదల చేయలేకపోయామని అధికారులు తెలిపారు. ఉద్యోగాల భర్తీలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా ఉండేందుకు సర్వీస్ నిబంధనలకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ నుంచి సమాధానం రావడం ఆలస్యం కావడంతో విడుదల కాస్తా ఆలస్యమైందని అధికారులు తెలిపారు.

TSSPDCL)లో వివిధ ఉద్యోగాల భర్తీకి పత్రికా ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 3,025 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో జూనియర్ లైన్ మెన్ పోస్టులు 2500, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (JPO) పోస్టులు 25, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 500 ఉన్నాయి.

పోస్టుల వివరాలు…

పోస్టులు ఖాళీలు
జూనియర్ లైన్ మెన్ 2500
జూనియర్ పర్సనల్ ఆఫీసర్ 25
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ 500
మొత్తం పోస్టులు 3,025

అర్హతలు…

పోస్టులు అర్హత
జూనియర్ లైన్ మెన్ ఐటీఐ (ఎలక్ట్రీషియన్‌) లేదా పాలిటెక్నిక్‌ డిప్లొమా (ఎలక్ట్రీషియన్)
జూనియర్ పర్సనల్ ఆఫీసర్ డిగ్రీతో పాటు తగిన అనుభవం ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ డిగ్రీతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.

Website

NOTIFICATION ::

ONLINE APPLY LINK::CLICK HERE

జూనియర్ పర్సనల్ ఆఫీసర్ NOTIFICATION::CLICK HERE

జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ NOTIFICATION::CLICK HERE

JR LINE MEN JOBS NOTIFICATION::CLICK HERE

TSTRANSCO Junior Lineman Previous Question Paper Download::CLICK HERE

🙏🙏దయచేసి మీ మిత్రులతో షేర్ చేయండి .. ఇతరులకు సహాయపడండి .. 🙏🙏

మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం join our telegram

Click Here TO Join Our TELEGRAM

Leave a Comment