ఇంటర్ తర్వాత ఏం చదవాలన్న సందేహాలు చాలామంది విద్యార్థుల్లో ఉంటాయి. ఇంటర్ తర్వాత చాలా కెరీర్ ఆప్షన్లు ఉంటాయి. విద్యార్థులు తమ అభిరుచిని బట్టి ఆయా కోర్సుల్ని ఎంచుకోవచ్చు. కెరీర్‌ను చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇంటర్ తర్వాత విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ రంగాల్లో కెరీర్ ఎంచుకోవచ్చు. మరి ఇంటర్ తర్వాత చేయాల్సిన కోర్సులేంటీ? కెరీర్‌ను ఎలా తీర్చిదిద్దుకోవాలి?
ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న వివిధ రకాల కోర్సుల వివరాలు, ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని అందిస్తున్నాం. దీన్ని ఉపయోగించుకుని మీరు కోరుకున్న బంగారు భవిష్యత్తు కోసం తగిన నిర్ణయాన్ని తీసుకోండి.
1.ఇంటర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ విద్యార్థులు ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్స్ కోర్సుల్ని ఎంచుకోవచ్చు. బీఎస్సీ డిగ్రీతో పాటు టీచింగ్, మేనేజ్‌మెంట్, లా, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు చేయొచ్చు.
2.బీటెక్, బీఈ లాంటివి టెక్నికల్ కోర్సుల కిందకు వస్తాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాలు ఉంటాయి.
3.మ్యాథ్స్ గ్రూప్ విద్యార్థులకు టెక్నికల్ కోర్సులు ఉపయోగపడ్తాయి. బీఈ, బీటెక్ పూర్తి చేసినవాళ్లు ఎంటెక్ కూడా చదవొచ్చు. ఎంబీఏ లాంటి కోర్సుల్ని చేయొచ్చు.
4.టెక్నికల్‌లో డిప్లొమా కోర్సులు కూడా ఉంటాయి. డిప్లొమా కోర్సులు మూడేళ్లు చేయాల్సి ఉంటుంది. ఇందులో కూడా మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాలు ఉంటాయి
5.ఇంటర్ బయాలజీ విద్యార్థులు మెడిసిన్ కోర్సుల్ని ప్రధానంగా ఎంచుకుంటారు. దాంతో పాటు బీడీఎస్, ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, బీఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, ఫిజియోథెరపీ, లా, మేనేజ్‌మెంట్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు చేయొచ్చు
6.బ్యాచిలర్ డిగ్రీలో అగ్రికల్చర్, బయోకెమిస్ట్రీ, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, హోటల్ మేనేజ్‌మెంట్, బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, బాటనీ, జువాలజీ, జెనెటిక్స్ లాంటి కోర్సులు ఉంటాయి
7.ఐదేళ్ల పాటు ఇంటిగ్రేటెడ్ లా కోర్సులు చేయొచ్చు. ఎల్‌ఎల్‌బీతో కలిపి బీఎస్సీ, బీకామ్, బీటెక్, బీబీఏ లాంటి కోర్సుల్ని పూర్తి చేయొచ్చు.
8. మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఐదేళ్ల బీబీఏ+ఎంబీఏ, రీటైల్ మేనేజ్‌మెంట్ డిప్లొమా కోర్సులుంటాయి
9.ఫ్యాషన్, డిజైనింగ్ రంగంలోనూ బ్యాచిలర్ కోర్సులున్నాయి. ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైనింగ్, టెక్స్‌టైల్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, ఫర్నీచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ కోర్సులు చేయొచ్చు.
10.ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇష్టమైతే బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ యోగా, బ్యాచిలర్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ చదవొచ్చు.
11.ఇంటర్ సీఈసీ విద్యార్థులు బీకామర్స్, చార్టెర్డ్ అకౌంటెన్సీ, బ్యాచిలర్స్‌లో ఎకనమిక్స్, కంపెనీ సెక్రటరీషిప్ కోర్స్, లా, మేనేజ్‌మెంట్, టీచింగ్ కోర్సులు చేయొచ్చు
12. వొకేషనల్ వైపు వెళ్లాలనుకునేవారికి బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్, డిప్లొమా ఇన్ వొకేషనల్ కోర్సులు ఉంటాయి
13.13. ఇక ఆర్ట్స్ రంగంలో సోషల్ వర్క్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, మల్టీమీడియా, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, హిస్టరీ, హ్యుమానిటీస్, ఫైనాన్స్, లిటరేచర్, ఫిలాసఫీ, సైకాలజీ లాంటి కోర్సులున్నాయి
మీ మిత్రులతో షేర్ చేయగలరు